డ్రగ్స్ రాకెట్‌లో శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీ?

డ్రగ్స్ రాకెట్‌లో శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీ?

bollywood actress

ప్రతీకాత్మక చిత్రం

డ్రగ్ రాకెట్‌కు సంబంధించి జరిగిన పార్టీలలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ప్రముఖ డాన్సర్ నోరా ఫతేహి పేర్లు ఉన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు శ్రద్ధా సోదరుడు సిద్ధాంత్ కపూర్, సోషల్ మీడియా స్టార్ ఓర్రీ, దర్శకులు అబ్బాస్ మస్తాన్, రాజకీయ నాయకుడి కుమారుడు జీషాన్ సిద్దిఖీ పేర్లు కూడా నార్త్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ రాకెట్‌కు సంబంధించి ముంబై, దుబాయ్‌లలో భారీ పార్టీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పార్టీలను మహమ్మద్ సలీం సుహైల్ షేక్ అనే వ్యక్తి నిర్వహించినట్లు సమాచారం. ఇతను అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీం డోలాకు అత్యంత సన్నిహితుడని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ కేసులో మరో కీలకమైన కోణం కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలిష్ పార్కర్ కూడా ఈ పార్టీలకు హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే శ్రద్ధా కపూర్ పేరు బలంగా వినిపించడానికి మరో కారణం కూడా ఉంది. గతంలో హసీనా పార్కర్ బయోపిక్‌లో శ్రద్ధా కపూరే ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. 


నేటి బాలలే రేపటి సమాజ సేవకులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్