సబ్ స్టేషన్‌లోనే మద్యం పార్టీలు
ప్రతీకాత్మక చిత్రం
జగిత్యాలలో అసిస్టెంట్ లైన్‌మెన్ల నిర్వాకం
జగిత్యాల టౌన్, నవంబర్ 15 (ఈవార్తలు): సబ్ స్టేషన్‌నే బార్‌గా మార్చేశారు విద్యుత్తు అధికారులు. ఇదేంటని అడిగితే రీఫ్రెష్ అవుతున్నామని హల్చల్ చేశారు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. అసిస్టెంట్ లైన్‌మెన్లుగా పనిచేస్తున్న ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్.. సబ్ స్టేషన్‌లోనే మందు పార్టీ చేసుకున్నారు. సబ్‌స్టేషన్‌లో ఇదేం పని అని అడిగితే.. రీఫ్రెష్ అవుతున్నామని, తాగితే తప్పేంటని అనడం గమనార్హం. వీరి తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. తాగితే ఇంట్లోనో, బార్లలోనో తాగాలి కానీ, విద్యుత్తు సబ్ స్టేషన్లను మద్యం పార్టీలకు అడ్డాగా మార్చడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.