నేటి బాలలే రేపటి సమాజ సేవకులు

నేటి బాలలే రేపటి సమాజ సేవకులు

childrens day

ప్రతీకాత్మక చిత్రం

భాష్యం పాఠశాల బాలల దినోత్సవంలో మార్కండేయులు

ఏఎస్ రావు నగర్, నవంబర్ 15 (ఈవార్తలు): ఏఎస్ రావు నగర్ లోని భాష్యం పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్ఈఓ మార్కండేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి సమాజ సేవకులు అన్నారు. పిల్లలు దేవుడిచ్చిన వరమని వారిని జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు. భాష్యం విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో సెంట్రల్ లెవెల్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నామన్నారు.భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పిల్లలంటే ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపేవారని, అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవం గా జరుపుకుంటామన్నారు. సీఈవో చైతన్య మాట్లాడుతూ భవిష్యత్తుకు బాల్య దశ ఎంతో కీలకమైంది అన్నారు. ప్రధానోపాధ్యాయుడు అమరేశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాలు వనిత బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విద్యార్థులకు వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.


ఏఐపై నియంత్రణ అవసరమా?
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్