8 గంటల పనిదినం కోసం పోరాడతా: దీపిక
దీపికా పడుకోణె
‘8 గంటల పనిదినం మాత్రమే కావాలి.. ఓవర్ టైమ్ నా వల్ల కాదు!’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేయడంతోనే దీపిక పదుకొనేను సందీప్ వంగా స్పిరిట్ నుంచి తొలగించారా? ఇటీవలి కాలంలో దీపికకు మద్ధతు పలుకుతున్నవారంతా చెబుతున్న పాయింట్ ఇది. అయితే ఒక బిడ్డ తల్లిగా దీపిక ఇలా కోరితే అది సమంజసమే కానీ, ఇంకా బయటకు తెలియని కొన్ని ఇతర విషయాలు కూడా ఈ త్రో - ఔట్ సీన్ కి కారణమయ్యాయని తెలుస్తోంది. ప్రభాస్ సరసన స్పిరిట్ తో పాటు కల్కి సీక్వెల్ కల్కి 2898 ఏడి నుంచి కూడా దీపికను తొలగించారు. ఈ రెండు సినిమాలను కోల్పోయినా కానీ, దీపిక బాణీ ఎక్కడా మారలేదు. తాను 8గంటల పనిదినానికి కట్టుబడి ఉన్నానని దీపిక పదే పదే ప్రకటిస్తోంది. తాను మాత్రమే కాదు.. ఇకపై తల్లులు ఎవరైనా సెట్స్ లో ఉంటే వారు 8 గంటలు మాత్రమే పని చేసేలా తాను ఏదో ఒకటి చేస్తానని కూడా ప్రకటించేసింది దీపిక. దీని అర్థం బిడ్డ తల్లుల కోసం ఒక అసోసియేషన్ ని ప్రారంభిస్తుందా? అనే సందేహం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఇదంతా ఏమో తెలీదు కానీ, ఇకపై అనవసరమైన మానసిక, శారీరక ఒత్తిడిని బిడ్డ తల్లులైన ఆర్టిస్టులు ఎవరూ భరించాల్సిన అవసరం లేదు. సరిగా పని చేయాలంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని నేను నమ్ముతాని చెప్పింది దీపిక.