రజినీకాంత్ తో మూవీ.. కమల్ హాసన్ ఏమన్నారంటే?

రజినీకాంత్ తో మూవీ.. కమల్ హాసన్ ఏమన్నారంటే?

Kamal Haasan

కమల్ హాసన్ 

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పేరు సొంతం చేసుకున్న రజనీకాంత్ - కమలహాసన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కలిసి చాలా చిత్రాలలో నటించారు. కానీ ఆ తర్వాత కాలంలో ఏమైందో తెలియదు కానీ మళ్లీ వీరిద్దరూ కలిసి నటించిన దాఖలాలు లేవు. అలా దాదాపుగా మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించాలని ఒక వర్గం ఆడియన్స్ పెద్ద ఎత్తున కోరుకుంటున్న నేపథ్యంలో అటు వీళ్లిద్దరూ కూడా సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందే రజనీకాంత్ తన 173వ చిత్రాన్ని కమలహాసన్ నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మొదట కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహిస్తారు అంటూ అధికారికంగా ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి సుందర్ సి తప్పుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై కమలహాసన్ మాట్లాడుతూ.. "నేను ఈ సినిమాకు నిర్మాతని.. నా చిత్ర నటుడు రజనీకాంత్ ను నేను సంతృప్తి పరచాలి. అందుకే అనేక స్క్రిప్ట్లను వింటున్నాము. రజినీకాంత్ స్క్రిప్ట్ ను ఓకే చేసిన తర్వాతనే ప్రాజెక్టు లాక్ చేయబడుతుంది. ఇది కాకుండా నేను రజనీకాంత్ తో ఒక సినిమా కోసం కలిసి పని చేస్తున్నాను. అది త్వరలోనే ప్రకటిస్తాము" అంటూ కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ తలైవార్ 173 సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది అని సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ ఇటీవలే లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ సినిమా చేసి డిజాస్టర్‌ను మూటగట్టుకున్నారు. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే యేడాది విడుదల కానుంది.


నేటి బాలలే రేపటి సమాజ సేవకులు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్