అనుభవంతోనే తెలుసుకున్నా: సోనాక్షి సిన్హా
సోనాక్షి సిన్హా
అన్నీ తెలుసని అనుకున్న రోజే తమకు అదే చివరి రోజు అవుతుందని అభిప్రాయపడింది. 'కొందరు తమని తప్పు అంటే ఎంత మాత్రం ఒప్పుకోరు. తామే రైట్ అని బుకాయిస్తారు? చేసిన పని తప్పు అని ఒప్పుకోవడానికి వాళ్లకి ఎంత మాత్రం మనసు రాదు. తప్పును స్వీకరించడంలో తప్పముంది? నేనెప్పుడు తప్పుడు, వైఫల్యాల గురించి భయపడను.తప్పులు చేయడం ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. చేసిన తప్పును మళ్లీ చేయకుండా జాగ్రత్త పడతాం. పిల్లలకు కూడా అంతే నడిచే వయసులో పిల్లలు చాలాసార్లు కింద పడతారు. అలా పడినప్పుడే మళ్లీ లేచి ఎంత బలంగా నడవగలం అన్నది వాళ్లకీ అర్దమవుతుంది. కింద పడ్డామని భయపడి పైకి లేవడం మానేయరుగా. ఆ క్షణానికి భయపడినా తగిలిన గాయం మానిన తర్వాత మళ్లీ లేచి నడక మొదలు పెడతారు. అందుకే జీవితంలో ప్రతీ దశకు, ప్రతీ వృత్తికి ఇది వర్తిస్తుందని నేను నమ్ముతాను. కొన్నిసార్లు తప్పులు కూడా మంచి చేస్తాయన్నారు. 'ఈ విషయాన్ని అనుభవ పూర్వకంగానే తెలుసుకున్నాను. చాలా మంది ఫలానా పని చేసి తప్పు చేసామని ఆక్షణంలో బాధపడినా? తర్వాత అదే రైట్ అవుతుందన్నారు. 'నటిగా రకరకాల పరిశ్రమల్లో పని చేసాను. ఎంతో మంది భిన్నమైన వ్యక్తులను కలిసాను. అక్కడ సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకున్నాను. వాళ్ల దగ్గరకు వెళ్లి? అక్కడ నేనే కెరెక్ట్ అని మొండిగా మాట్లాడటం అన్నది మూర్ఖత్వం అవుతుంది. కొందరు మనుషులు ఇదే తీరులో కనిపిస్తారు. చేసిన పని తప్పు అయినా? దాన్ని అంగీకరించడానికి మనసు మాదన్నారు. అలాంటి వారి విషయంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మారకపోతే వారి ఖర్మ అని వదిలేస్తాను' అని తెలిపింది.