గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

godavari pushkaralu

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి, నవంబర్ 25 (ఈవార్తలు): గోదావరి పుష్కరాలకు  ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. కేంద్రంతో పాటుగా ఏపీ ప్రభుత్వం పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది. కేంద్రం నిధులను ప్రకటించింది. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కమిటీల ఏర్పాటుతో పాటుగా నిధులను విడుదల చేసింది. కాగా.. కుంభమేళా తరహాలో ఘాట్లు - వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ 100 కోట్ల ను పుష్కరాల కోసం ప్రకటించారు. తాజాగా రైల్వే శాఖ పుష్కరాల కు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తు గానే ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధమైంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్