నా పేరుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దు: రకుల్

నా పేరుతో మెసేజ్‌లు వస్తే నమ్మొద్దు: రకుల్

Rakul Preet Singh

రకుల్ ప్రీత్ సింగ్

హైదరాబాద్/ముంబై, నవంబర్ 25 (ఈవార్తలు): తన పేరుతో కొందరు కేటుగాళ్లు నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఆ నంబర్ నుంచి వచ్చే సందేశాలకు ఎవరూ స్పందించవద్దని, వెంటనే దాన్ని బ్లాక్ చేయాలని సూచించారు. 8111067586 అనే ఫోన్ నంబర్‌కు తన ఫొటోను డీపీగా పెట్టి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి.. కొందరు వ్యక్తులకు సందేశాలు పంపుతున్నట్లు రకుల్ గుర్తించారు. ఈ విషయం తెలియగానే ఆమె వెంటనే స్పందించారు. ఫేక్ చాట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, “నా పేరుతో ఎవరో వాట్సాప్‌లో ప్రజలకు సందేశాలు పంపుతున్నారు. దయచేసి ఆ నంబర్‌కు స్పందించకండి. అది నాది కాదు” అని స్పష్టం చేశారు. 


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్