వెంకీ.. ఫ్యామిలీ విత్ క్రైం!

విక్టరీ వెంకటేశ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు కిక్కే కిక్కు. అందుకే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ, కాస్త క్రైం జోడించాలని ఫిక్స్ అయ్యాడు.

aadharsha kutumbam title analysis

ప్రతీకాత్మక చిత్రం

విక్టరీ వెంకటేశ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు కిక్కే కిక్కు. అందుకే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ, కాస్త క్రైం జోడించాలని ఫిక్స్ అయ్యాడు. తాజాగా, త్రివిక్రమ్‌తో మొదలుపెట్టిన 'ఆదర్శ కుటుంబం' విషయానికి వస్తే, ఇక్కడ కూడా అదే ఫార్ములా కనిపిస్తోంది. టైటిల్ వినడానికి చాలా సాఫ్ట్ గా, పద్ధతిగా అనిపిస్తోంది. కానీ టైటిల్ డిజైన్ లో 'ఏకే 47' అనే ట్యాగ్ లైన్ పెట్టడం, అలాగే లోగోలో రక్తపు చుక్క ఉండటం చూస్తుంటే, ఇది మామూలు ఫ్యామిలీ స్టోరీ కాదని క్లారిటీ వచ్చేసింది. పైకి ఆదర్శవంతమైన కుటుంబంలా కనిపిస్తూనే, లోపల ఏదో పెద్ద క్రైమ్ డీల్ లేదా గొడవల్లో ఆ కుటుంబం చిక్కుకున్నట్లుగా కథ ఉండే ఛాన్స్ ఉంది. మరో క్రేజీ ప్రాజెక్ట్ 'దృశ్యం 3'. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక సామాన్యుడు చేసే క్రైమ్, దాని చుట్టూ తిరిగే కథ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడో భాగంతో ఆ ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. వెంకటేశ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చాలా స్మార్ట్ గా ఉన్నాయి. కేవలం సాఫ్ట్ సినిమాలు చేస్తే మాస్ ఆడియన్స్ దూరమయ్యే ప్రమాదం ఉంది, అలాగని ఓవర్ యాక్షన్ సినిమాలు చేస్తే ఫ్యామిలీస్ కు నచ్చకపోవచ్చు. అందుకే ఈ 'ఫ్యామిలీ విత్ క్రైమ్' అనే పాయింట్ ను పట్టుకున్నారు.


ఒక్కో ఓటు - పల్లె భవిష్యత్తు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్