పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నాడు.
ఉస్తాద్ భగత్ సింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ కనిపించనుండగా, శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్‌గా మెరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2026 లో రిలీజ్ కానుంది అట. అయితే అలాంటి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఇవాళ సాయంత్రం 5:35 నిమిషాలకు బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.