సెంటిమెంట్స్ ఫాలో అవడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకరు. గత కొంతకాలంగా తాను తీసే సినిమాలకు అ అక్షరంతో మొదలయ్యే టైటిల్స్‌నే ఎక్కువగా పెడుతూ వస్తున్నారు.
త్రివిక్రమ్
సెంటిమెంట్స్ ఫాలో అవడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకరు. గత కొంతకాలంగా తాను తీసే సినిమాలకు అ అక్షరంతో మొదలయ్యే టైటిల్స్‌నే ఎక్కువగా పెడుతూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే త్రివిక్రమ్ నుంచి ఐదారు సినిమాలు రాగా ఇప్పుడు మరోసారి ఆ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు మాటల మాంత్రికుడు. విక్టరీ వెంకటేష్‌తో మొదటిసారి త్రివిక్రమ్ చేస్తున్న సినిమాకు కూడా ‘అ’ సెంటిమెంట్‌తోనే ఆదర్శ కుటుంబం.. ఏకే47 టైటిల్ పెట్టారు. టైటిల్ చూస్తుంటేనే ఎంతో తెలుగుదనం ఉట్టిపడుతుంది. మరోసారి త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతుండటంతో ఈ సినిమా కచ్ఛితంగా హిట్టవడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేశ్‌తో కలిసి పలు సినిమాలు చేయగా అవన్నీ మంచి హిట్లుగా నిలిచాయి. అలాంటి వారిద్దరి కాంబినేషన్ లో త్రివిక్రమ్ డైరెక్టర్ గా మొదటిసారి వెంకీతో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలున్నాయి.