సినిమాల్లో నటించాలని అనుకోకున్నా, అదృష్టం అంటే తనదేనని అంటోంది తెలుగు నటి శివానీ నాగరం. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చిందీ బ్యూటీ.
శివానీ నాగరం
సినిమాల్లో నటించాలని అనుకోకున్నా, అదృష్టం అంటే తనదేనని అంటోంది తెలుగు నటి శివానీ నాగరం. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చిందీ బ్యూటీ. ఆ గుర్తింపు తోనే సినిమా అనే థాట్ మనసులో మొదలైంది. అటుపై అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌లో ఛాన్స్ అందుకుంది. ఆ చిత్ర దర్శక, నిర్మాతలు యూ ట్యూబ్ లో చూసి అమ్మడిని అప్రోచ్ అవ్వడం..పాత్రకు సెట్ అవుతుందని భావించి ఎంపిక చేసారు. తొలి సినిమా షూటింగ్ సమయం లో చాలా టెన్షన్ పడింది. కానీ ఇప్పుడా టెన్షన్ పోయి నటిగా ధైర్యంగా పని చేస్తోంది. ఆ తర్వాత నటించిన లిటిల్ హార్స్ట్ కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం కొత్త అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలమే తనని స్టార్ గా మార్చిందని..తనని తాను ఎప్పుడూ అలా ఊహించుకోలేదని తెలిపింది.