బాలయ్య ఇంట్లో భారీ హోమం

అడ్డంకులన్నీ దాటుకుని 'అఖండ 2' ఎట్టకేలకు డిసెంబర్ 12న థియేటర్లలోకి దిగుతోంది. అయితే బాక్సాఫీస్ దగ్గర యుద్ధం చేయడానికి ముందు తన జూబ్లీహిల్స్ నివాసంలో ఒక భారీ హోమాన్ని నిర్వహిస్తున్నారట.

Balakrishna

బాలకృష్ణ

అడ్డంకులన్నీ దాటుకుని 'అఖండ 2' ఎట్టకేలకు డిసెంబర్ 12న థియేటర్లలోకి దిగుతోంది. అయితే బాక్సాఫీస్ దగ్గర యుద్ధం చేయడానికి ముందు తన జూబ్లీహిల్స్ నివాసంలో ఒక భారీ హోమాన్ని నిర్వహిస్తున్నారట. సినిమా విడుదలకు ముందు ఇలాంటి శాంతి పూజలు చేయడం మంచిదని పండితులు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా గత వారం రోజులుగా సినిమా విడుదలకు సంబంధించి జరిగిన ఆర్థిక, న్యాయపరమైన గొడవలు ఒకరకమైన నెగిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవాలనే ఉద్దేశంతోనే ఈ హోమం జరిపిస్తున్నట్లు సమాచారం. 'అఖండ' సినిమా కూడా శివుడి ఇతివృత్తంతో, సనాతన ధర్మం నేపథ్యంలో నడుస్తుంది. కాబట్టి దానికి తగినట్లుగానే రుద్ర హోమం లేదా చండీ హోమం వంటివి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, కమర్షియల్ గా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలని సంకల్పం తీసుకున్నారట.


పిల్లల భవితకు బాటలేద్దాం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్