భాగ్యశ్రీతో ప్రేమాయణంపై రామ్ క్లారిటీ
ప్రతీకాత్మక చిత్రం
యంగ్ హీరో రామ్ పోతినేని తన కొత్త చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రమోషన్లలో భాగంగా, తనపై వస్తున్న డేటింగ్ రూమర్లపై స్పష్టత ఇచ్చారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై రామ్ స్పందిస్తూ, ‘ఈ సినిమా కోసం నేను ఓ ప్రేమ గీతం రాశాను. అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి. మనసులో ఏమీ లేకుండా అంత గొప్పగా పాట ఎలా రాస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ నేను కేవలం సినిమాలోని పాత్రలను ఊహించుకొని ఆ పాట రాశాను. ఆ సమయానికి హీరోయిన్‌ను కూడా ఫైనల్ చేయలేదు’ అని వివరించారు.