జెడ్ స్పీడ్‌లో పూరి-సేతుపతి సినిమా!
ప్రతీకాత్మక చిత్రం
ఈ రోజుల్లో ఒక సినిమా మొదలయిందంటే చాలు.. అది రిలీజ్ అయ్యేసరికి ఎన్నాళ్లు పడుతుందో చెప్పడం కష్టం. ఇక అది 'పాన్ ఇండియా' సినిమా అయితే మినిమమ్ రెండేళ్లు ఫిక్స్ అవ్వాల్సిందే. కానీ టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ మాత్రం ఈ రూల్స్ కి అతీతం. ఆయనే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫలితాలు ఎలా ఉన్నా, ఆయన మేకింగ్ స్పీడ్ మాత్రం ఎప్పుడూ తగ్గదు. ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమాతో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఎప్పుడు షూటింగ్ అయిపోయింది? అని జనాలు ఆశ్చర్యపోయేలా ప్లానింగ్ సాగింది. జూన్ నెలలో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లింది. కట్ చేస్తే.. నవంబర్ ఎండింగ్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. కేవలం ఐదు నెలల్లో.. అదీ విజయ్ సేతుపతి లాంటి బిజీ పాన్ ఇండియా స్టార్ డేట్స్ ని పక్కాగా వాడుకుని సినిమాను ఫినిష్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం మన ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటున్నాయి. పుష్ప, గేమ్ చేంజర్, దేవర లాంటి సినిమాలు ఎంత టైం తీసుకున్నాయో చూస్తున్నాం. ఇలాంటి టైమ్ లో పూరీ జగన్నాథ్ జూన్ నుంచి నవంబర్ లోపు ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను చుట్టేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. బడ్జెట్ కంట్రోల్ లో ఉండాలన్నా, హీరోల కాల్షీట్స్ వేస్ట్ కాకూడదన్నా ఈ స్పీడ్ చాలా ముఖ్యం. ఈ సినిమా షూటింగ్ చివరి రోజు సెట్స్ లో ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. నిర్మాత ఛార్మి వీడియో కాల్ చేసి మాట్లాడగా.. "పూరీ గారిని మిస్ అవుతాను" అంటూ విజయ్ సేతుపతి ఎమోషనల్ అయ్యారు.