ఎన్నో త్యాగాలు చేశా: ప్రియాంక చోప్రా

బాలీవుడ్ బ్యూటీగా తనకంటూ ఒకప్పుడు స్టార్ స్టేటస్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. అనూహ్యంగా అవకాశాలు తగ్గడంతో హాలీవుడ్‌కి వెళ్ళిపోయింది.

priyanka chopra

ప్రియాంక చోప్రా

బాలీవుడ్ బ్యూటీగా తనకంటూ ఒకప్పుడు స్టార్ స్టేటస్ దక్కించుకున్న ప్రియాంక చోప్రా.. అనూహ్యంగా అవకాశాలు తగ్గడంతో హాలీవుడ్‌కి వెళ్ళిపోయింది. పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తాను 20 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..‘ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో నాకు తెలియలేదు. అయితే వచ్చిన ప్రతి ప్రాజెక్టును ఒప్పుకున్నాను. ముఖ్యంగా నాకు అవకాశాలు రావడమే అదృష్టంగా భావించాను. అందుకే పాత్ర ఏదైనా సరే ఓకే చెప్పేసాను. ఇక 20 ఏళ్ల వయసులో ఖాళీ లేకుండా ప్రాజెక్టులు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్లే ప్రతి పాత్రను అంగీకరించాను. సినీ జీవితంలో ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఎన్నో పుట్టిన రోజులు, పండుగ దినాలు మిస్ అయ్యాయి. ఆఖరికి నా తండ్రి హాస్పిటల్‌లో ఉంటే ఆయన చివరి రోజుల్లో కూడా దగ్గరుండి చూసుకోలేకపోయాను. నా కుటుంబంతో గడిపిన సందర్భాలు కూడా లేవు. ఆ సమయంలో అన్ని కష్టాలు పడ్డాను కాబట్టే నేడు ఈ స్థాయిలో ఉన్నాను. 20 ఏళ్లు త్యాగం చేసి నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. ముఖ్యంగా నాడు పడ్డ కష్టమే నేడు ఈ స్థాయికి చేర్చింది’ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.


ఒక్కో ఓటు - పల్లె భవిష్యత్తు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్