ఓం శాంతి శాంతి శాంతిః సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది.
ఓం శాంతి శాంతి శాంతిః
ఓం శాంతి శాంతి శాంతిః సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఇటీవల షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా, ‘ఓం శాంతి శాంతి శాంతి’ నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ డిసెంబర్ 8న విడుదల కానుందని తెలిపారు. అలాగే ‘ఓం శాంతి శాంతి శాంతి’ వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు పోస్టర్ ద్వారా ఫైనల్ చేశారు. ‘మా గోదారొళ్ళకి ఎటకారం, మమకారం తో పాటు పట్టుదల కూడా కూసంత ఎక్కువే...ఆయ్’ క్యాప్షన్ జత చేస్తూ.. తరుణ్, ఈషా మధ్య తగ్ వార్ జరగబోతున్నట్లుగా ఉన్న పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో భార్యభర్తలుగా కనిపించగా.. పెళ్లి బట్టల్లోనే ఇరు కుటుంబాలు ఓ తాడును పోటాపోటీగా లాగుతూ కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.