కొత్త గెటప్‌లో ఎన్టీఆర్
ప్రతీకాత్మక చిత్రం
ఎన్టీఆర్- నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలను అందుకుంది. మామూలు హీరోలనే నీల్ నెక్ట్స్ లెవెల్ లో చూపిస్తారు అలాంటిది ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఇంకెలా ప్రెజెంట్ చేస్తారోనని చూడ్డానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. నీల్ కూడా ఆ ఎగ్జైట్‌మెంట్ ను ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ మూవీలో తారక్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా నీల్ చూపించబోతున్నారని తెలుస్తోంది. పైగా ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా కష్టపడుతూ చాలా స్లిమ్ గా తయారయ్యారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను థియేటర్లలో చూస్తామా అనే ఆసక్తి ఆడియన్స్ కు రోజురోజకీ పెరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. డ్రాగన్ సినిమా ఎంట్రీ కోసం భారీ సెట్స్ వేస్తుండగా, ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉండబోతుదని, ఇంకా చెప్పాలంటే స్పెషల్ గా ఫ్యాన్స్ కోసమే నీల్ ఆ సీక్వెన్స్ ను డిజైన్ చేశారని టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఈ సీక్వెన్స్ లో తారక్ తో పాటూ మరో వందమంది కూడా జూనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారని, మూవీలో ఈ ఎంట్రీ సీక్వెన్స్ యాక్షన్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఈ మూవీని తారక్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా చేయాలని నీల్ ప్రయత్నిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.