రేపు ఓటీటీలోకి ‘మాస్ జాతర’
ప్రతీకాత్మక చిత్రం
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా గడవక ముందే ఈ సినిమా డిజిటల్ వేదికపైకి రావడం గమనార్హం. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా ఎన్నో అంచనాల మధ్య ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. అయితే, రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాలను అందుకోలేక ఫ్లాప్‌గా నిలిచింది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వచ్చాయి. దీంతో సినీ ప్రియుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటనతో స్పష్టత ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తన ప్రకటనలో తెలిపింది. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు.