ఆస్కార్ బరిలో 'మహావతార్ నరసింహ'

ఆస్కార్ బరిలో 'మహావతార్ నరసింహ'

 mahavatar narsimha

ప్రతీకాత్మక చిత్రం

భారతీయ యానిమేషన్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, విజువల్ వండర్‌గా తెరకెక్కిన 'మహావతార్ నరసింహ' చిత్రం అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్స్ 2026) బరిలో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి అర్హత సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న 35 మేటి చిత్రాలతో పాటు ఈ అరుదైన గౌరవాన్ని అందుకుంది. భారతీయ పురాణ గాథలకు హాలీవుడ్ స్థాయి సాంకేతికతను జోడించి, క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించి, హోంబలే ఫిల్మ్స్ సమర్పించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవడం భారతీయ సినిమాకు, ముఖ్యంగా యానిమేషన్ పరిశ్రమకు గర్వకారణంగా మారింది. ఈ రేసులో 'మహావతార్ నరసింహ'.. డిస్నీ వారి 'జూటోపియా 2', 'కే పాప్ డెమన్ హంటర్స్', జపాన్‌కు చెందిన 'డెమన్ స్లేయర్: కిమెత్సు నో యాబా-ఇన్ఫినిటీ కాజిల్', 'స్కార్లెట్' వంటి ప్రపంచ ప్రఖ్యాత యానిమేషన్ చిత్రాలతో పోటీపడనుంది


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్