పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ.. కొంతకాలంగా సోషల్ మీడియాకి కూడా గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కియారా అద్వానీ
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ.. కొంతకాలంగా సోషల్ మీడియాకి కూడా గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత తల్లి అయిన తొలిసారి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని కూల్ ఫోటోలను పంచుకుంది. అందులో ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె.. ఈ బాడీ కాన్ అవుట్ ఫిట్ తో అందరి హృదయాలను దోచుకుంది. మిర్రర్ ముందు స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా..‘చివరికి నాకు ఒక రాత్రి ఫ్రీగా దొరికింది.ఈ రాత్రిని నన్ను ఆస్వాదించనివ్వండి’ అంటూ క్యాప్షన్ జోడించింది. తల్లి అయిన తర్వాత కూడా కియారాలో ఎటువంటి మార్పులు రాలేదు సో క్యూట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.