నాకు ఆ బాధ లేదు: కీర్తి సురేశ్
కీర్తి సురేశ్
కెరీర్ విషయంలో కానీ, రెమ్యూనరేషన్ విషయంలో కానీ హీరోలకు ఉండే విలువ హీరోయిన్లకు ఉండదు. హీరోలకు పదుల కోట్లలో రెమ్యూనరేషన్లు ఇస్తే, హీరోయిన్లకు మాత్రం లక్షల్లోనో లేదంటే హీరో రెమ్యూనరేషన్ లో నాలుగో వంతు కూడా ఇవ్వరు. ఈ విషయంపై కీర్తి సురేష్ స్పందించింది. రెమ్యూనరేషన్ విషయంలో హీరోయిన్లకు తక్కువ ఇస్తున్నారనే విషయం గురించి మాట్లాడుతూ, ఎవరి జీతమైనా వారి పని, మార్కెట్, క్రేజ్ ను బట్టే ఉంటుందని, హీరోలతో కంపేర్ చేస్తే తనకు తక్కువ పారితోషికమిస్తారనే బాధ తనకెప్పుడూ లేదని, ఏదైనా డిమాండ్ ను బట్టే ఉంటుందని ఆమె స్పష్టం చేసింది.