ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మారుతి సారీ

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మారుతి సారీ

maruthi

మారుతి

చిన్న మాట చిలికి చిలికి గాలివానలా మారుతుందంటే ఇదేనేమో. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఒక స్టార్ హీరో ఫ్యాన్స్, డైరెక్టర్ మారుతిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలు ఆ డైరెక్టర్ అలా ఎందుకు అన్నాడు? ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అనే చర్చ జోరుగా సాగింది. అయితే ఈ వివాదం ముదిరకముందే దర్శకుడు రియలైజ్ అయి వెంటనే స్పందించారు. వివరాల్లోకి వెళ్తే.. 'ది రాజా సాబ్' ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడిన కొన్ని మాటలు ఎన్టీఆర్ అభిమానులను నొప్పించాయి. "నేను కాలర్ ఎగరేసుకోమని చెప్పను.. ప్రభాస్ కటౌట్ కు అది చాలా చిన్న మాట" అని మారుతి అనడం, అది పరోక్షంగా ఎన్టీఆర్ ను టార్గెట్ చేసినట్లు ఉందని ఫ్యాన్స్ భావించారు. ఎందుకంటే ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ తరచుగా "కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తా" అని అంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా మారుతిపై ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపించారు. పరిస్థితిని గమనించిన మారుతి, లేటెస్ట్ గా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. "నేను ఎవరినీ కించపరచాలనో, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనో ఆ మాటలు అనలేదు. ఫ్లోలో వచ్చిన మాటలే తప్ప, ఉద్దేశపూర్వకంగా అన్నవి కావు" అని వివరణ ఇచ్చారు.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్