అనిల్ రావిపూడి సినిమా అంటే ప్రమోషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ప్రమోషన్స్ చూసే సినిమా చూసేయాలి అనే రేంజ్ లో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తాడు.
నయనతార
అనిల్ రావిపూడి సినిమా అంటే ప్రమోషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ప్రమోషన్స్ చూసే సినిమా చూసేయాలి అనే రేంజ్ లో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తాడు. మన శంకరవరప్రసాద్ గారు విషయంలోనూ ప్రమోషన్స్‌లో అనిల్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ ఉందట. సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవితో పాటు నయనతారని కూడా ఇన్వాల్వ్ చేసే ప్లాన్ ఉందట. నయనతార సినిమాల్లో నటించడమే కానీ కనీసం ఆమె ఏ మూవీ ఈవెంట్ కి అటెండ్ అవ్వదు. కానీ మన శంకర వరప్రసాద్ సినిమా కోసం మాత్రం నయనతారకి ముందే ప్రమోషన్స్ కండీషన్స్ పెట్టిన తర్వాతే ఆమెను తీసుకున్నారట. మెగా ఫ్యాన్స్ ని మెప్పించేలా రకరకాల ప్రమోషనల్ ప్లానింగ్స్ అనిల్ చేస్తున్నారట. ముఖ్యంగా వింటేజ్ చిరుని గుర్తు చేసేలా మెగా ఫ్యాన్స్ అందరు మళ్లీ ఆ చిరంజీవిని తలచుకునేలా చేస్తారట. మన శంకర వరప్రసాద్ సాంగ్స్, టీజర్ అన్నీ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచగా తప్పకుండా ఈ సంక్రాంతికి మెగా బాస్ మెగా ఎంటర్టైనర్ తో అదరగొట్టబోతున్నాడని తెలుస్తోంది