ఆంధ్రా కింగ్ తాలూకా యూ/ఏ

ఆంధ్రా కింగ్ తాలూకా యూ/ఏ

Andhra king thaluka

ప్రతీకాత్మక చిత్రం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో వస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. అందరూ చూడదగ్గ సినిమా. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్. బుకింగ్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి’ అని పోస్ట్ చేసింది. ఈ సినిమాపై రామ్ పోతినేని భారీ అంచనాలు పెట్టుకున్నారు. నటుడిగానే కాకుండా ఈ చిత్రంతో ఆయన గేయ రచయితగా కూడా అరంగేట్రం చేస్తున్నారు. 'నువ్వుంటే చాలే' అనే పాటకు రామ్ స్వయంగా సాహిత్యం అందించారు. వివేక్-మెర్విన్ ద్వయం స్వరపరిచిన ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఆలపించారు.


అంబానీని మించేలా రేవంత్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్