అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపించడం ఐశ్వర్యారాయ్‌కి కొత్తేమీ కాదు. కేన్స్ ఫిలింఫెస్టివల్ లో దశాబ్ధాలుగా పాల్గొంటున్న ఐష్ ఆ ఉత్సవాలకు ప్రతియేటా ప్రత్యేక గ్లామర్‌ను జోడిస్తున్నారు
ఐశ్వర్యారాయ్
అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపించడం ఐశ్వర్యారాయ్‌కి కొత్తేమీ కాదు. కేన్స్ ఫిలింఫెస్టివల్ లో దశాబ్ధాలుగా పాల్గొంటున్న ఐష్ ఆ ఉత్సవాలకు ప్రతియేటా ప్రత్యేక గ్లామర్‌ను జోడిస్తున్నారు. తాజాగా జెడ్డా, సౌదీ అరేబియా: 2025లో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మూడో రోజు ఐశ్వర్యారాయ్ రెడ్ కార్పెట్ పై మెరుపులు మెరిపించారు. ఈ సందర్భంగా వేదికపై ఆమె మాట్లాడుతూ.. మహిళల అభద్రతా భావం గురించి లేవనెత్తారు. ఇంకా అవే పాత కాలం ప్రశ్నలు మహిళలకు ఎదురవుతున్నాయి.. వాటిని మార్చాల్సి ఉందని అన్నారు. అంతేకాదు... ఈ ఉత్సవం మహిళామణుల కోసం మహారాణుల కోసం అంటూ ఉత్సాహం చూపించారు ఐష్.