యూఏఈ వేదికగా శుక్రవారం నుంచి అండర్-19 ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈసారి కూడా భారత్, పాకిస్తాన్ మధ్య మరో మహా సమరం జరగనుంది. అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ డిసెంబర్ 14న జరగనుంది.
అండర్ 19 ఆసియా కప్
నేడే భారత్ - యూఏఈ మ్యాచ్
14న భారత్-పాక్ మధ్య పోరు
యూఏఈ వేదికగా శుక్రవారం నుంచి అండర్-19 ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈసారి కూడా భారత్, పాకిస్తాన్ మధ్య మరో మహా సమరం జరగనుంది. అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ డిసెంబర్ 14న జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్ ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. సీనియర్ మెన్స్ ఆసియా కప్‌లో భారత్ పాకిస్తాన్‌ను ఫైనల్‌తో సహా 3 సార్లు ఓడించింది. అయితే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో మాత్రం పాకిస్తాన్ భారత్‌ను ఓడించింది. ఈ అండర్-19 ఆసియా కప్‌లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో. అండర్-19 ఆసియా కప్‌లో భారత్‌కు ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ జట్టులో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ కూడా భాగమయ్యాడు.
టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్ (గ్రూప్ దశ)
భారత్ వర్సెస్ యూఏఈ -డిసెంబర్ 12(ఐసీసీ అకాడమీ గ్రౌండ్), ఉదయం 10:30 గంటలకు
భారత్ వర్సెస్ పాకిస్తాన్ -డిసెంబర్ 14(ఐసీసీ అకాడమీ గ్రౌండ్), ఉదయం 10:30 గంటలకు
భారత్ వర్సెస్ మలేషియా- డిసెంబర్ 16(ది సెవెన్స్ స్టేడియం), ఉదయం 10:30 గంటలకు
అండర్-19 ఆసియా కప్ కోసం భారత జట్టు:
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండూ (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ ఏ. పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేష్, హేనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉద్ధవ్ మోహన్, ఆరోన్ జార్జ్