15 ఏళ్ల తర్వాత సఫారీల గెలుపు
ప్రతీకాత్మక చిత్రం
2010 తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ గెలిచింది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం దక్షిణాఫ్రికాకు ప్రత్యేకంగా నిలిచింది. ప్రొటీస్ జట్టు భారత గడ్డపై చివరిసారిగా 2010లో గెలిచింది. ఆ సమయంలో ఆ జట్టు భారత్‌ను ఇన్నింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత తర్వాత భారత్‌తో ఎనిమిది టెస్టులు ఆడింది. ఇందులో భారత్ ఏడు గెలువగా.. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. టెంబా బావుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ఓటములను అధిగమించి 15 ఏళ్ల తర్వాత విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే టెస్టు మ్యాచుల్లో జట్లు లక్ష్యాన్ని ఛేదించడంలో అరుదుగా విజయం సాధిస్తాయి. ఈ స్టేడియంలో 2004లో దక్షిణాఫ్రికాపై భారత్ 117 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ మైదానంలో 100 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని జట్లు సాధించలేకపోయాయి. ఈ మైదానంలో జరిగిన టెస్ట్ మ్యాచులో భారత్‌కు అతిపెద్ద లక్ష్యాన్ని సాధించే అవకాశం లభించింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో బోల్తాపడింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయానికి అతిపెద్ద కారణం కెప్టెన్ బావుమా. అతని నాయకత్వంలో 11 టెస్టులు ఆడిన ప్రొటీస్ జట్టు.. అందులో పది మ్యాచులను గెలిచింది.