రాజు’గా బాలయ్య కొత్త సినిమా
ప్రతీకాత్మక చిత్రం
‘నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇంత వరకూ పట్టాలెక్కలేదు. అఖండ2 చిత్రీకరణ పూర్తయిన బాలయ్య వేర్వేరు పనుల్లో బిజీగా ఉండటంతో లాంచింగ్ ఆలస్యమైంది. గత నెలలోనే లాంచింగ్ ప్లాన్ చేసారు. కానీ వీలు పడలేదు.ఈ నేపథ్యంలో ఈనెలఖరున పూజాకార్యక్రమాలతో ప్రారంభించ డానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి కొంత మంది ప్రముఖులు పాల్గొంటారని సమాచారం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారుట. ఓ పాత్రలో రాజుగా అలరించనున్నారట. మరో పాత్రకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఓ హీరోయిన్ గా నయనతార ఎంపికైనట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఆ విషయం మరో రెండు..మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. మరో నాయిక ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని దర్శకుని సన్నిహితుల నుంచి తెలిసింది. ఆ పాత్ర కోసం తెలుగు నటిని తీసుకోవాలనుకుంటున్నారుట. మరి ఆ ఛాన్స్ ఏ బ్యూటీకి దక్కుతుందో చూడాలి. ఇప్పటికే బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.