ఐబొమ్మ క్లోజ్

ఐబొమ్మ క్లోజ్

ibomma closed by ravi

ప్రతీకాత్మక చిత్రం

రవితోనే మూసేయించిన పోలీసులు

హైదరాబాద్, నవంబర్ 16 (ఈవార్తలు): తెలుగు సినీ పరిశ్రమను ఏళ్ల తరబడి వణికించిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ, బప్పం టీవీ మూతపడ్డాయి. రవి అరెస్టు అనంతరం అతడి వద్ద ల్యాప్‌టాప్‌లు, వెబ్ లాగిన్‌లు, సర్వర్ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అతడి సమక్షంలోనే ఆ వెబ్‌సైట్లను శాశ్వతంగా బ్లాక్ చేయించారు. ప్రస్తుతం పోలీసులు రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల సంఖ్యలో హార్డ్‌డిస్క్‌లను, అతని బ్యాంక్ లావాదేవీలను, పైరసీ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయ మార్గాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పైరసీ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై కూడా దర్యాప్తు ప్రారంభమైంది. రవిని మరింత సమాచారం కోసం కస్టడీకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ విభాగం సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. కాగా, భార్యే పోలీసులకు రవిని పోలీసులకు పట్టించినట్లు సమాచారం. విదేశాల్లో ఉంటోన్న రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నాయి. ఆ నేపథ్యంలోనే విడాకుల చర్చ కోసం రవి హైదరాబాద్‌కు వస్తున్న సమాచారాన్ని ఆమె గోప్యంగా సైబర్ క్రైమ్ అధికారులకు అందించడంతో పోలీసులు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె అందించిన టైమ్‌లైన్, లొకేషన్ వివరాల ఆధారంగా రవిని ట్రాక్ చేసిన పోలీసులు, ఫ్రాన్స్ నుండి అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్న రవిని కూకట్‌పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు.


హిందువులను ఓటుబ్యాంకుగా మారుస్తా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్