అంగవైకల్యం ఉందని..

అంగవైకల్యం ఉందని..

karimnagar crime

ప్రతీకాత్మక చిత్రం

కూతురిని చంపిన తండ్రి

కొనఊపిరితో కొడుకు

కరీంనగర్‌లోనిలో ఘటన

వావిలాలపల్లి/కరీంనగర్, నవంబర్ 16 (ఈవార్తలు): కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు(17), కూతురు(15)ను గొంతు నులిమి చంపేందుకు తండ్రి యత్నించాడు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా..  కుమారుడు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి మల్లేశం పరారయ్యాడు. పని మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ గమనించిన తల్లి పోచమ్మ ఆసుపత్రిలో చేర్పించింది. వీళ్ళిద్దరికీ మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటరావుపేట కాగా.. గత ఏడేళ్ల నుంచి కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం కుటుంబం కిరాయికి ఉంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


హిందువులను ఓటుబ్యాంకుగా మారుస్తా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్