కెజిఎఫ్, స‌లార్‌ను మించి.. డ్రాగ‌న్

కెజిఎఫ్, స‌లార్‌ను మించి.. డ్రాగ‌న్

dragon

ప్రతీకాత్మక చిత్రం

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కు నేష‌న‌ల్ వైడ్ గా బాగా గుర్తింపు ద‌క్కింది. ఆ త‌ర్వాత చేసిన దేవ‌ర‌, వార్2 సినిమాలు కూడా ఎన్టీఆర్ స్థాయిని మ‌రింత పెంచి త‌న మార్కెట్ ను బాగా పెంచాయి. అయితే ప్ర‌స్తుతం తార‌క్.. కెజిఎఫ్‌, స‌లార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌నీల్ అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రూపొందుతుంది. స‌లార్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో పాటూ, ఇటు ఎన్టీఆర్‌, అటు నీల్.. ఇద్ద‌రికీ మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉండ‌టంతో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మొద‌టిసారి తెర‌కెక్కుతున్న సినిమా కావ‌డంతో డ్రాగ‌న్ పై అంద‌రికీ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పైగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కెరీర్లో మునుపెన్న‌డూ లేనంత విధంగా స్లిమ్ గా మారారు. ఈ సినిమాలో తార‌క్ ను ప్ర‌శాంత్ నీల్ నెవ‌ర్ బిఫోర్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నార‌ని, ఆల్రెడీ మూవీలో జూనియ‌ర్ ఎన్టీఆర్ కోసం ప్ర‌శాంత్ నీల్ ప‌లు ఎలివేష‌న్ సీన్స్ ను రూపొందించార‌ని, సినిమాలోని ప్ర‌తీ ఫ్రేమ్ లోనూ ఎన్టీఆర్ అంచ‌నాల‌కు మించి క‌నిపించ‌డంతో పాటూ త‌న స్క్రీన్ ప్రెజెన్స్ తో అంద‌రిన ఆశ్చ‌ర్య‌ప‌రుస్తార‌ని చిత్ర యూనిట్ వ‌ర్గాలు చెప్తున్నాయి.


హిందువులను ఓటుబ్యాంకుగా మారుస్తా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్