టీమిండియా కోరుకున్న పిచ్ ఇదే: గంగూలీ
సౌరవ్ గంగూలీ
పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌ను తయారు చేయడం ఏంటని కోల్‌కతా పిచ్‌పై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మేనేజ్‌మెంట్ సమతూకమైన పిచ్‌ను కోరినా.. కోల్‌కతా పిచ్ క్యూరెటర్ అందుకు భిన్నమైన వికెట్ ఇచ్చారని మండిపడుతున్నారు. అయితే ఈ విమర్శలను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు. ఇందులో పిచ్ క్యూరేటర్ తప్పు లేదని, టీమిండియా కోరుకున్నట్లుగానే పిచ్ తయారు చేశామని తెలిపాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ కోరిన విధంగానే పిచ్‌ను రూపొందించాం. పిచ్‌పై మ్యాచ్‌కు ముందు నాలుగు రోజులుగా వాటరింగ్ చేయలేదు. అందుకే అది ఇలా బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారింది. ఈ విషయంలో పిచ్ క్యురేటర్ ముఖర్జీని తప్పుపట్టలేం'అని గంగూలీ స్పష్టం చేశాడు.మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. తాము కోరినట్లుగానే పిచ్ తయారు చేశారని, కానీ తామే అందుకు తగినట్లు ఆడలేకపోయామని అంగీకరించాడు.