గుజరాత్ విద్యా శాఖ మంత్రి, రవీంద్ర జడేజా సతీమణి రివాబా భారత జట్టు ఆటగాళ్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్తను పొగుడుతూనే ఇతర భారత ఆటగాళ్లు తప్పుడు పనులు చేస్తారని ఆరోపించారు.
రివాబా జడేజా
విదేశాలకు వెళ్తే తప్పుడు పనులు
జడేజా భార్య రివాబా సంచలన వ్యాఖ్యలు
తన భర్త ఆణిముత్యం అని కితాబు
గుజరాత్ విద్యా శాఖ మంత్రి, రవీంద్ర జడేజా సతీమణి రివాబా భారత జట్టు ఆటగాళ్లపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్తను పొగుడుతూనే ఇతర భారత ఆటగాళ్లు తప్పుడు పనులు చేస్తారని ఆరోపించారు. ఓ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతూ.. ‘నా భర్త లండన్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు ఆడటానికి వెళ్లవలసి వస్తుంది. అయినప్పటికీ ఇప్పటివరకు ఆయన ఎప్పుడూ వ్యసనానికి లోను కాలేదు. ఎందుకంటే ఆయన తన బాధ్యతను అర్థం చేసుకుంటారు’ అని అన్నారు. రివాబా జడేజా తన మాటలను కొనసాగిస్తూ, తన భర్తకు అలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేవని కూడా పేర్కొన్నారు. ఆయన కూడా కావాలంటే చేయగలరని, కానీ ఆయన తన బాధ్యతలను బాగా అర్థం చేసుకున్నందున చేయరని స్పష్టం చేశారు.