ఆ ఇద్దరే మా ఓటమిని శాసించారు: రిషభ్ పంత్

ఆ ఇద్దరే మా ఓటమిని శాసించారు: రిషభ్ పంత్

rishabh pant

రిషబ్‌ పంత్‌ 

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా, కార్బిన్ బోష్ అద్భుతమైన భాగస్వామ్యంతో తమ ఓటమిని శాసించారని టీమిండియా తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. ఈ భాగస్వామ్యాన్ని త్వరగా విడదీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిషభ్ పంత్.. అనవసర ఒత్తిడితో వికెట్లు పారేసుకున్నామని చెప్పాడు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు ప్రతికూలంగా మారిందని తెలిపాడు. 'ఇలాంటి మ్యాచ్‌ గురించి ఎక్కువగా ఆలోచించలేం. ఈ లక్ష్యాన్ని మేం ఛేదించాల్సింది. కానీ అనవసర ఒత్తిడితో వికెట్లు కోల్పోయాం. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ ఉదయం(మూడో రోజు ఆట) టెంబా బవుమా, కార్బిన్ బోష్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ పార్ట్‌నర్‌షిప్ మాకు తీవ్ర నష్టం చేసింది. వికెట్ నుంచి కొంత సహకారం ఉంది. కానీ ఈ తరహా వికెట్లపై 120 పరుగుల లక్ష్యం కూడా కష్టంగా ఉంటుంది. అయితే మేం ఒత్తిడిని తట్టుకొని కండిషన్స్‌కు తగ్గట్లు ఆడాల్సింది. మెరుగయ్యే విషయాల గురించి మేం ఇంకా ఆలోచించలేదు. కానీ తదుపరి మ్యాచ్‌కు కచ్చితంగా బలంగా తిరిగి వస్తాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.


పెళ్లిపై మరోసారి త్రిష హాట్ కామెంట్స్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్