డబ్ల్యూటీసీలో జడేజా ఆల్‌టైం రికార్డు

డబ్ల్యూటీసీలో జడేజా ఆల్‌టైం రికార్డు

ravindra jadeja

రవీంద్ర జడేజా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలోనే 150 వికెట్లతో పాటు 2500 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా జడేజా ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటి వరకు 47 డబ్ల్యూటీసీ మ్యాచ్‌లు ఆడిన జడేజా 150 వికెట్లు తీయడంతో 2,532 పరుగులు చేశాడు. అంతేకాకుండా భారత గడ్డపై 250 వికెట్ల మైలు రాయి అందుకున్న నాలుగో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. ఈ జాబితాలో అశ్విన్(383), అనిల్ కుంబ్లే(350), హర్భజన్ సింగ్(265), రవీంద్ర జడేజా(250*) కంటే ముందున్నారు. ఒకే దేశంలో 2000 ప్లస్ రన్స్‌తో పాటు 250 వికెట్లు తీసిన రెండో ప్లేయర్‌గా జడేజా నిలిచాడు. జడేజా కంటే ముందు ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తమ సొంతగడ్డపై ఈ ఫీట్ సాధించాడు. టెస్ట్‌ల్లో 4000 పరుగులు చేయడంతో పాటు 300 వికెట్లు పడగొట్టిన నాలుగో ప్లేయర్‌‌గా నిలిచాడు. అతను 88 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.


పెళ్లిపై మరోసారి త్రిష హాట్ కామెంట్స్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్