రాజస్థాన్ కెప్టెన్‌గా జడేజా
ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును రవీంద్ర జడేజా నడిపించనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ సారథిగా యశస్వి జైస్వాల్‌తో పాటు ధ్రువ్ జురెల్ రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. గత సీజన్‌లో సంజూ శాంసన్ గైర్హాజరీలో జట్టును నడిపించిన రియాన్ పరాగ్‌కు కూడా సారథ్య బాధ్యతలు ఇస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ వీటికి యశస్వి జైస్వాల్ ఒక్క ఫొటోతో బదులిచ్చాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి దిగిన సెల్ఫీని జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరిగే తొలి టెస్ట్‌కు ఈ ఇద్దరు సిద్దమవుతున్నారు. ఈ సందర్భంగా టీమ్ బస్‌లో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఓవైపు ట్రేడ్ డీల్ సంబంధించిన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫొటో షేర్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. రవీంద్ర జడేజానే తమ తదుపరి కెప్టెన్ అనే విషయాన్ని యశస్వి జైస్వాల్ పరోక్షంగా వెల్లడించాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెప్టెన్సీ ఆఫర్ నేపథ్యంలోనే ఈ స్వాప్ డీల్‌కు జడేజా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.