సెక్రటేరియట్‌లో 134 మంది ట్రాన్స్‌ఫర్

సెక్రటేరియట్‌లో 134 మంది ట్రాన్స్‌ఫర్

secretariat bulk transfers hyderabad

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, నవంబర్ 12 (ఈవార్తలు): తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. చాలా కాలంగా ఒకే డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగించింది. మొత్తం 134 మంది అధికారులను బుధవారం బదిలీ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణల్లో భాగంగా భారీ స్థాయిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులంతా 12 ఏళ్లుగా ఒకే విభాగంలో పనిచేస్తుండటం గమనార్హం. కొన్ని శాఖల్లో అధికారుల కొరత ఉండగా, మరికొన్ని శాఖల్లో అధిక సిబ్బంది ఉన్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలిసింది. ఈ బదిలీలు సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిభారాన్ని సమతుల్యం చేయడానికి కూడా దోహదపడనున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.


రాజన్న ఆలయం మూసివేత
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్