రేపటి నుంచే సఫారీలతో టెస్టులు
ప్రతీకాత్మక చిత్రం
సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమవుతోంది. కోల్‌కతా వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2025-27లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు సన్నదమవుతున్నాయి. ఈ సిరీస్‌లో గెలిచిన జట్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు మెరుగవనున్నాయి. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే, టీ20 ఫార్మాట్‌లో అద్భుత విజయాన్నందుకున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. టెస్ట్‌ల్లో మాత్రం ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ అయ్యింది. భారత క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ పరాజయాలతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరలేకపోయింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ గంభీర్ కోచింగ్‌కు సవాల్‌గా మారింది. తాజా డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇంగ్లండ్ పర్యటనతో పాటు వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ గెలిచి జోరు మీద ఉంది. ఈ సిరీస్‌కు స్టార్ స్పోర్ట్స్‌తో పాటు జియో హాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తుంది. భారత్, సౌతాఫ్రికా సిరీస్ మ్యాచ్‌లు ఈ రెండు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
షెడ్యూల్:
తొలి టెస్ట్: నవంబర్ 14- 18 వరకు (కోల్‌కతా)
రెండో టెస్ట్: నవంబర్ 22-26 వరకు(రాంచీ)
భారత్ జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.
సౌతాఫ్రికా జట్టు..
టెంబా బవుమా (కెప్టెన్), డివాల్డ్ బ్రెవిస్, ఎయిడెన్ మార్‌క్రమ్, కార్బిన్ బాష్, డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, ముల్డర్, ముత్తుసామి, రబాడ, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరిన్నే.