ఎవ‌డ‌బ్బ సొమ్మనుకుంటున్నవ్?....రేవంత్ సరదా కోసం 100 కోట్లు ఖర్చా?....

ఫుట్‌బాల్ సరదా కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

Aelayeti Maheshwar Reddy

 ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

ప్రజాధనం దుర్వినియోగం.. ఆర్థిక నేరం

సీఎం రేవంత్‌పై ఏలేటి మండిపాటు

హైదరాబాద్, డిసెంబర్ 11 (ఈవార్తలు): ఫుట్‌బాల్ సరదా కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని సీఎం రేవంత్ రెడ్డి రూ.వంద కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ఆర్ధిక నేర‌మే అని మండిపడ్డారు. ప్రజాధనంతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుంటే ప్ర‌జ‌లు ఫుట్ బాల్ ఆడుకుంటారని ఫైర్ అయ్యారు. సీఎం ఫుట్ బాల్ స‌ర‌దా కోసం రూ.100 కోట్లకుపైగా ఖర్చు పెట్ట‌డం ప్ర‌జాధ‌నం దుర్వినియోగం కాదా? అని ప్రశ్నించారు. ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడ‌డానికి ప్ర‌భుత్వం రూ.ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేస్తోందో, ఏయే శాఖ‌ల నుంచి ఖ‌ర్చు చేస్తోందో, ఎందుకు ఖ‌ర్చు చేస్తోందో సీఎం వివ‌ర‌ణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘సీఎం రేవంత్ టీమ్‌ను సింగ‌రేణి స్పాన్స‌ర్ చేస్తోంద‌ని మీడియాలో చూశాను.. ఈ ఫుట్ బాల్ ఆట కోసం సింగ‌రేణి డ‌బ్బుల‌ను ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎందుకు ఖ‌ర్చు చేస్తున్నారు? చెప్పాల్సి వస్తుంది’ అని వార్నింగ్ ఇచ్చారు. ఇవే డ‌బ్బుల‌ను సింగ‌రేణిలో ఉన్న క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌డానికో, కార్మికుల సంక్షేమానికో ఖర్చు చేయొచ్చని వ్యాఖ్యానించారు. మెస్సీ టీమ్‌తో రేవంత్ టీమ్ ఫుట్ బాల్ ఆడ‌డం వ‌ల్ల రాష్ట్రానికి ప్ర‌యోజ‌న‌మేంటో చెప్పాలని నిలదీశారు. మెస్సీ ఒక ఎగ్జిబిష‌న్ మ్యాచ్ ఆడితే, అప్పీయ‌రెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటార‌ని, మ‌రి ఆయనకు ఇచ్చే ఫీజు ఏ ప్ర‌భుత్వ శాఖ ఇస్తోందని ప్రశ్నించారు


విభూది వస్త్రం.. త్రిశూలమే అస్త్రం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్