జీవనశైలి సరిగ్గా లేనట్లయితే కచ్చితంగా ఏదొక ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది జంగ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు. దాని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. పురుషుల్లో ఎక్కువగా వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్..దీన్ని త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం సాధ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రొస్టేట్ క్యాన్సర్..పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత సమర్థవంతంగా చికిత్స అందించవచ్చంటున్నారు నిపుణులు. సాధారణంగా 50ఏండ్ల పైబడిన పురుషుల్లో ప్రొస్టేట్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లేదా కుటుంబ చరిత్రలో ఈ క్యాన్సర్ ఉన్నవారికి కూడా ఈ ముప్పు ఎక్కువగానే ఉంటుంది. మీరు ఏడాదికోసారి తప్పనిసరిగా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ప్రొస్టేట్ క్యాన్సర్ ను త్వరగా గుర్తించడంతో పాటు చికత్స అందించడం చాలా అవసరం.
ప్రొస్టేట్ క్యాన్సర్ చాలా నెమ్మదిగా పురోగమిస్తుంది. ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సమస్య తీవ్రమయ్యే కొద్దీ లక్షణాలు బయటకు కనిపిస్తుంటాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ లో ముందుగా కనిపించే లక్షణం మూత్ర విసర్జనలో అసౌకర్యంగ, మూత్ర విసర్జనలో మంట, అంతరాయం ఏర్పడటం, ఇది రాత్రి సమయాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి పరిమణం పెరిగిపోయి మూత్ర నాళం నొక్కుకుపోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుంది.
మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం మరో లక్షణం. మూత్రంలో రక్తం కనిపించడాన్ని హెమటూరియా అని, వీర్యంలో రక్తం కనిపిస్తే హెమటోస్పెర్మియా అంటారు. ఈ సంకేతాలు చాలా ప్రమాదకరమైనవి. అంగస్తంభన సమస్యలు ప్రొస్టేట్ ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే ఈ సమస్య ఇతర అనారోగ్యాల వల్ల కూడా రావచ్చు. వీపు కింది భాగంలో తుంటి భాగంలో, తొడల భాగంలో నిరంతరాయంగా నొప్పిలేదా ఏదో లాగుతున్నట్ల అనిపిస్తుంది. దీన్ని కూడా తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే క్యాన్సర్ ఎముకల వరకు వ్యాపించి ఉండవచ్చు. తరచుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కూడా ప్రొస్టేట్ క్యాన్సర్ వల్ల రావచ్చు. ప్రొస్టేట్ క్యాన్సర్ వల్ల ప్రొస్టేట్ గ్రంథి పరిమాణం పెరగటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
ప్రొస్టెట్ క్యాన్సర్ ను ఎలా నిర్ధారించాలి?
ప్రొస్టేట్ క్యాన్సర్ ను వీలైనంత త్వరగా గుర్తించాలి. దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్టు ద్వారా పీఎస్ఏ స్థాయిని కొలుస్తుంది. ఎలివేటెడ్ పీఎస్ఏ స్థాయిలు ప్రొస్టేట్ క్యాన్సర్ ను సూచిస్తాయి. కొన్ని సార్లు క్యాన్సర్ లేకున్నా ఈ స్థాయిలు ఎలివేట్ అవుతుంటాయి. అల్ట్రా సౌండ్, ఎంఆర్ఐ, సిటీస్కాన్ లలో ప్రొస్టేట్ గ్రంథిలో ఏర్పడిన అసాధారణ మార్పులను, పరిసర కణాల మీద ఈ మార్పుల ప్రభావాన్ని గుర్తించడం సాధ్యం అవుతుంది.
ఇది కూడా చదవండి: పచ్చి ఉల్లిపాయ తింటే పురుషులకు బోలేడు ప్రయోజనాలు..99శాతం మందికి ఈ ముచ్చటే తెలియదట.!