హైటెక్ పరికరాలతో అరుణి హాస్పిటల్
ప్రతీకాత్మక చిత్రం
ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం
మల్యాల/జగిత్యాల టౌన్, నవంబర్ 16 (ఈవార్తలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం అరుణి పిల్లల, మహిళల హాస్పిటల్‌ను ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం ప్రారంభించారు. హైటెక్ పరికరాలతో, అత్యాధునిక వసతులతో అందుబాటులోకి వచ్చిన ఈ హాస్పిటల్‌లో చిన్న పిల్లలు, మహిళలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తామని ఆస్పత్రి వైద్యుడు ఆగంతం నరేశ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జీవనరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.