మానేరు వంతెన కింద గుర్తుతెలియని మృతదేహం
ప్రతీకాత్మక చిత్రం
తంగళ్లపల్లి, నవంబర్ 16 (ఈవార్తలు): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఆదివారం ఉదయం గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మానేరు వంతెన కింద ఈ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే తంగళ్లపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, దర్యాప్తు చేపట్టారు. మృతదేహం ఎవరిది, అది ఆ ప్రాంతానికి ఎలా వచ్చింది అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.