ఇండిగో బాధితులకు రూ.10 వేల వోచర్లు

ప్రయాణికులకు ఇండిగో స్వల్ప ఊరట నిచ్చింది. వరుస విమానాల రద్దు, ప్రయాణికుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందించనుంది.

indigo 10 k travell vouchers

ఇండిగో

ప్రయాణికులకు ఇండిగో స్వల్ప ఊరట నిచ్చింది. వరుస విమానాల రద్దు, ప్రయాణికుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్‌లను అందించనుంది. ఈ మేరకు గురువారం ఆ సంస్థ ఒక  ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 3, 4, 5 తేదీలలో విమాన అంతరాయాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది.  విమాన ఆలస్యాలు, రద్దుల కారణంగా ప్రయాణికులకు ఎయిర్‌లైన్ చెల్లించాల్సిన వాపసులు, ప్రభుత్వం నిర్దేశించిన పరిహారానికి ఇండిగో ప్రకటించిన ఈ ఆఫర్‌ అదనం. రాబోయే 12 నెలల్లో ఇండిగోతో భవిష్యత్తులో చేసే ఏదైనా ప్రయాణానికి వోచర్లను రిడీమ్ చేసుకోవచ్చని తెలిపింది. రద్దు చేసిన అన్ని విమానాలకు రీఫండ్‌ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపింది.


విభూది వస్త్రం.. త్రిశూలమే అస్త్రం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్