ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై క్లారిటీ.. తొలి విడతలో వారికే అవకాశం

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు సొంత ఇంటిని అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇల్లు పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా తొలి విడతగా ఇళ్లను ఎవరికి ఇవ్వాలనే దానిపై మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు.

CM Revanth Reddy, Indiramma house scheme

సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ఇల్లు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు సొంత ఇంటిని అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇల్లు పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా తొలి విడతగా ఇళ్లను ఎవరికి ఇవ్వాలనే దానిపై మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలి విడతలో రాష్ట్రంలో సొంతంగా స్థలం ఉన్న వారికి మాత్రమే తొలి దశలో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయనున్నారు. రెండో దశలో స్థలం కూడా లేని వారిని గుర్తించి స్థలం కేటాయింపుతోపాటు ఇల్లు మంజూరు చేయనున్నారు. ఈనెల ఆరో తేదీ నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 15-20 తేదీల మధ్య గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి జాబితాను ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్థలాన్ని లబ్ధిదారులకు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. స్థలాలు అందుబాటులో లేని చోట్ల భూమి కొనుగోలు చేసి అందించనున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు పొందారో వారికి ఈసారి కేటాయింపులు ఉండవు.

ఇళ్ల కేటాయింపుల్లో దివ్యాంగులకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా నిర్మించే ఇంటికి డిజైన్ ఎలా ఉండాలి అనేదానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు సహాయం చేయనుంది. 400 చదరపు అడుగులు విస్తీర్ణానికి తగకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇళ్ల కింద బిల్లులు మంజూరు చేయనున్నారు. పునాది పూర్తయితే వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో లక్ష, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.1.25 లక్షలు, స్లాబ్ సమయంలో రూ.1.75 లక్షలు, నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు ప్రభుత్వం అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడంతో లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హులుగా ఎంపికయ్యే వారికి ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయాన్ని అందిస్తుండడంతో వేలాదిమంది సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. గతంలో ఈ పథకంలో భాగంగా లబ్ధి పొందిన వారిని మాత్రం అనర్హులుగా గుర్తిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటి వరకు లబ్ధి పొందని వారికి మేలు చేకూరనుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్