జూన్ 15 నుండి భక్తులకు రాజన్న ఆలయ దర్శనాలు నిలిపివేత

త్వరలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు మొదలు కానున్న నేపథ్యంలో జూన్ 15వ తేదీ నుంచి రాజన్న ఆలయ దర్శనాలు నిలిపివేయనున్నారు.

vemulawada temple

జూన్ 15 నుండి భక్తులకు రాజన్న ఆలయ దర్శనాలు నిలిపివేత

వేములవాడ, ఈవార్తలు : త్వరలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు మొదలు కానున్న నేపథ్యంలో జూన్ 15వ తేదీ నుంచి రాజన్న ఆలయ దర్శనాలు నిలిపివేయనున్నారు. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా భీమన్న గుడిలో దర్శనాలు, అభిషేకాలు, అన్న పూజలు, కోడె మొక్కులు తదితర పూజా కైంకర్యాలు జరిపించనున్నారు. జూన్ 10లోపు భీమన్న గుడి వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ల ఏర్పాటు, వేద పాఠశాల ముందు స్థలంలో శృంగేరీ శంకర మఠం ఖాళీ స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి అభిషేకాలు, నిత్య కల్యాణాలు నిర్వహించటానికి తగు ఏర్పాటు చేయనున్నారు.

కాగా, రెండు రోజుల్లో రాజన్న ఆలయ విస్తరణ తుది ప్లాన్ ఖరారు కానుంది. అనంతరం 21న టెండర్లు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు, ఆలయ విస్తరణ పనుల కోసం ఆర్ అండ్ బీ, దేవాదాయ శాఖ కలిసి కమిటీగా ఏర్పడనున్నాయి. ఈ కమిటీ ఈ నెల 15న దేవాదాయ శాఖ కమిషనర్‌తో కలిసి వేములవాడ ఆలయాన్ని సందర్శించనుంది. అనంతరం పనుల కోసం చకచకా ఏర్పాట్లు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్