||ప్రతీకాత్మక చిత్రం||
మేషం
విశ్వాసం మెండుగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దూకుడు స్వభావాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే ప్రయోజనాలు పొందలేరు. ప్రేమ గొడవలో మీ భాగస్వామిని క్షమించండి. ఉద్యోగులకు మహిళా ఉద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఒక పని చేస్తారు. ఇతర పనులు ఆగిపోతాయి.
అదృష్ట సంఖ్య : 2, అదృష్ట రంగు : వెండి, తెలుపు
వృషభం
చిరకాల స్నేహితుడిని కలుస్తారు. రియల్ ఎస్టేట్‌లో డబ్బులు పెట్టడానికి మంచి రోజు. ఈ రోజు ఆఫీస్‌లో మీరు స్పెషల్‌గా ఫీలవుతారు. ఏదైనా పోగొట్టుకుంటే వ్యక్తిత్వాన్ని పెంచుకోవటానికి మీకంటూ కొంచెం సమయాన్ని కేటాయించుకోండి
అదృష్ట సంఖ్య : 1, అదృష్ట రంగు : ఆరెంజ్, బంగారం
మిథునం
పనిచేసే చోట ఒత్తిడి, ఇంట్లో కూడా ఒత్తిడి. దాంతో చిరాకు ఏర్పడి ఏకాగ్రత తగ్గుతుంది. స్థలం అమ్మాలనుకుంటే మంచి రేటుకు కొనేవారు దొరుకుతారు. దాంతో మీకు బాగా కలిసివస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి సర్‌ప్రైజ్ ఇచ్చే చాన్స్ ఉంది.
అదృష్ట సంఖ్య : 8, అదృష్ట రంగు : నలుపు, నీలం
కర్కాటకం
మీ స్వభావం లక్ష్యం వైపు నడిపిస్తుంది. విజయం కోసం మీ ఆలోచనలు మార్చుకోవాల్సి వస్తుంది. మానసిక శక్తి బలపడుతుంది. ఈ రోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి. కుటుంబ సభ్యుల భావాలను దెబ్బతీయకండి. సెమినార్లు, ఎగ్జిబిషన్లు మీకు కొత్త విషయాలు తెలియజేస్తాయి. జీవిత భాగస్వామితో బాధ కలుగుతుంది.
అదృష్ట సంఖ్య : 3, అదృష్ట రంగు : కాషాయం, పసుపు
సింహ
మంచి మూడ్‌లో ఉంటారు. స్థలం అమ్మటానికి మంచి రోజు. బాగా కలిసివస్తుంది. ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. పని మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు ఎంచుకొనే కార్యక్రమాలు మీ అంచనాలకు మించి లబ్ధికి చేకూరుస్తాయి. జీవితభాగస్వామిపై శ్రద్ధ చూపుతారు.
అదృష్ట సంఖ్య : 1, అదృష్ట రంగు : ఆరెంజ్, బంగారం
కన్య
ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్న చిన్న వస్తువులపై ఖర్చు చేస్తారు. కొత్తవి నేర్చుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఖాళీ సమయాన్ని అమ్మగారితో గడపాలని అనుకుంటారు. కానీ, కొన్ని అత్యవసర పనులు ఇబ్బంది పెడతాయి.
అదృష్ట సంఖ్య : 9, అదృష్ట రంగు : ఎరుపు, పసను
తుల
వృత్తి నైపుణ్యాన్ని పరీక్షించుకోవాల్సి వస్తుంది. మంచి ఫలితం కోసం ఏకాగ్రతతో పనిచేయాలి. ధూమపానం, మద్యపానం తగ్గిస్తే మంచిది. లేకపోతే అనారోగ్యం బారిన పడతారు. ఆర్థిక స్థితి దెబ్బతీస్తుంది. ఈ రోజు మీరు ప్రేమలో మునిగిపోతారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు.
అదృష్ట సంఖ్య : 2, అదృష్ట రంగు : వెండి, తెలుపు
వృశ్చికం
ప్రియమైన వ్యక్తితో సంబంధం దెబ్బతింటుంది. ఎవరైనా సమస్యల పరిష్కారం కోసం వస్తే పట్టించుకోకండి. కష్టపడి పనిచేయటం వల్ల మీ లక్ష్యాలను చేరుకుంటారు. చిన్నప్పటి పని చేసేందుకు ఇష్టపడతారు. ఆఫీస్‌లో అన్నీ అనుకూలంగా ఉండొచ్చు.
అదృష్ట సంఖ్య : 4, అదృష్ట రంగు : గోధుమ, బూడిద
ధనుస్సు
అనారోగ్యం నుంచి కోలుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు వద్దు. మీ నిర్లక్ష్య వైఖరి తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తుంది. ప్రేమలో మునిగి తేలుతారు. ఆఫీస్‌లో పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించండి. సమస్యల్లో తలదూర్చేకంటే మౌనంగా ఉండటం మేలు. మీ సంసారం ఈ రోజు రొమాంటిక్‌గా ఉంటుంది.
అదృష్ట సంఖ్య : 1, అదృష్ట రంగు : ఆరెంజ్, బంగారం
మకరం
భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడిపై ఈ రోజు మంచి ఫలితాలు దక్కించుకుంటారు. ఒత్తిడి ఉన్నా ఉత్సాహంగా పనిచేస్తారు. ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. మీ వైవాహిక జీవితం కాస్త ఉక్కిరిబిక్కిరి కావొచ్చు.
అదృష్ట సంఖ్య : 1, అదృష్ట రంగు : ఆరెంజ్, బంగారం
కుంభం
ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుంచి అందుతాయి. స్నేహితులు, బంధువులు అనుకూలంగా ఉంటారు. ప్రేమ పారవశ్యాన్ని అనుభూతి చెందుతారు. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. అది దీర్ఘకాలిక బంధానికి చేటు కలిగించే ప్రమాదం ఉంది.
అదృష్ట సంఖ్య : 8, అదృష్ట రంగు : నలుపు, నీలం
మీనం
పని వల్ల విపరీతమైన కోపం వస్తుంది. వ్యాపారాభివృద్ధికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గరి వారి నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. జీవిత భాగస్వామి నులివెచ్చని స్పర్శను అనుభూతి చెందుతారు.
అదృష్ట సంఖ్య : 5, అదృష్ట రంగు : ఆకుపచ్చ, త్సామనము