1008 సార్లు ఓం నమః శివాయ అని జపిస్తే...మీ దశ తిరిగినట్లే.!

ఓం నమః శివాయ మంత్రం.. శివ మంత్రాలలో అత్యంత ప్రభావవంతమైన మంత్రాలలో ఒకటి. ఈ 3 పదాల శివ మంత్రం వ్యక్తి యొక్క జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఓం నమః శివాయ 1008 సార్లు పఠిస్తే ఏమవుతుంది? ఓం నమః శివాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం.

Om Namah Shivaya
ప్రతీకాత్మక చిత్రం 

ఓం నమః శివాయ ఈ పదం చాలా సార్లే విని ఉంటాం. వినడమే కాదు రోజులో చాలా సార్లు మన మనసులో అనుకుంటాం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవచ్చు.  మంత్రాలు సానుకూలమైన, జీవిత-ధృవీకరణ శక్తి యొక్క విశ్వవ్యాప్తికి మూలం. వాటిని జపించినా లేదా విన్నా కూడా ఎన్నో ప్రయోజనం పొందవచ్చు. అన్ని మంత్రాలలో, 'ఓం నమః శివాయ' అత్యంత శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల గాలిని శుద్ధి చేయడంతోపాటు మీ వ్యవస్థలో శక్తి బలపడుతుంది. వేల సంవత్సరాల నుంచి  ప్రజలు ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు. ఓం నమః శివాయ అని 1008 సార్లు చెప్పడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సానుకూల ఆకర్షణ:

ఓం నమః శివాయ..ఈ మంత్రాన్ని జపిస్తే మీలో సానుకూల శక్తిని నింపుతుంది. మీ నుండి చెడు శక్తిని లేదా ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. దీంతో మీ ఉన్న ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. 

ఇంద్రియ నియంత్రణ:

ఓం నమః శివాయ అని జపించడం ద్వారా మీరు మీ ఇంద్రియాలు మీ ఆధీనంలో ఉంటాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఈ మంత్రం మీ ఇంద్రియాలను నియంత్రించడంలో మీకు సహాయం చేస్తుంది. చెడు ఆలోచనలు మనసులో రాకుండా మంచి మార్గంలో పయణించేలా ఈ మంత్రం మీకు సహాయపడుతుంది. 

జీవిత లక్ష్యం వైపు: 

మీరు ఓం నమః శివాయ అని జపించినప్పుడు మీరు జీవితంలో ఒక లక్ష్యం, దిశవైపుగా పయణిస్తారు. మీరు జీవితంలో ఏదైనా సాధించాలనే దృక్పథాన్ని పెంచుకుంటారు. ఈ మంత్రాన్ని పఠించడం జీవిత లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది.

గ్రహ దోష నిర్మూలన:

గ్రహ వ్యవస్థలో 27 రాశులు, 9 గ్రహాలు ఉన్నాయి. ఓం నమః శివాయ అని పఠించడం వలన దుష్ట గ్రహాల ప్రతికూల ప్రభావాలను కొంత వరకు నిరోధించవచ్చు. ఎందుకంటే శివ తత్త్వమే పాలించే శక్తి ,గ్రహాలను శాసిస్తుంది. ఈ శివ నామస్మరణతో మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలను వదిలించుకోవచ్చు. గ్రహాలు మీ జీవితంపై సానుకూల ప్రభావం చూపుతాయి.

మానసిక ప్రశాంతత :

క్రమం తప్పకుండా ఈ మంత్రం  జపించడం వల్ల  చంచలమైన మనస్సును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని పఠించడం వలన భక్తుడు జీవితంలో విజయం, ఎదుగుదల కొరకు మహా శివుడి ఆశీస్సులు పొందటానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: ఈ ఒక్క జ్యూస్..యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్ పెడుతుంది..!


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్