పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్ నమోదైంది. ఒకవేళ నేరం రుజువైతే ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై బయటతిరుగుతున్న అతడు జైలుకు వెళ్లే అవకాశముంది.
ప్రతీకాత్మక చిత్రం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువ క్రికెటర్‌పై ఛార్జిషీట్ నమోదైంది. ఒకవేళ నేరం రుజువైతే ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై బయటతిరుగుతున్న అతడు జైలుకు వెళ్లే అవకాశముంది. బంగ్లాదేశ్ ‘ఏ’ జట్టుకు ప్రాతినిధ్యం వహించే టోఫెల్ అహ్మద్ రైహాన్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దాంతో.. సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు టోఫెల్‌పై కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. టోఫెల్ తనను మోసగించాడని ఫిర్యాదుదారు కీలక ఆధారాలను సమర్పించింది. తమ ఇద్దరి మధ్య జరిగిన ఫేస్‌బుక్ ఛాట్, హోటల్ రూమ్ బుకింగ్ వివరాలు, వైద్య పరీక్షల రిపోర్టును బాధితురాలు పోలీసులకు అప్పగించింది. అవన్నీ పరిశీలించాక మహిళలు, పిల్లలపై దాడుల నియంత్రణ చట్టం సెక్షన్ 9(1) కింద టోఫెల్‌పై ఛార్జిషీట్ దాఖలు చేశాం. తదుపరి విచారణ డిసెంబర్ 30న జరుగనుంది