సోషల్ మీడియాతో పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతోంది. చదువుపై దృష్టి సరిగా నిలకడగా లేకపోవడానికి కారణమవుతోంది. లైక్స్, షేర్స్, కామెంట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ చిన్న చిన్న వయసులోనే ఆత్మవిశ్వాసం దెబ్బతినే పరిస్థితి వస్తోంది.
సోనూసూద్
సోషల్ మీడియాతో పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతోంది. చదువుపై దృష్టి సరిగా నిలకడగా లేకపోవడానికి కారణమవుతోంది. లైక్స్, షేర్స్, కామెంట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ చిన్న చిన్న వయసులోనే ఆత్మవిశ్వాసం దెబ్బతినే పరిస్థితి వస్తోంది. అదే సమయంలో, డిజిటల్ ప్రపంచంలో ఉన్న ప్రమాదాల గురించి అవగాహన లేకపోవడంతో స్కామ్‌లు, నకిలీ అకౌంట్స్, ఆన్‌లైన్ బుల్లీయింగ్ వంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నిజమైన ఆటలు, బయట తిరుగుడు, స్నేహితులతో గడిపే ఆ అనుభూతులు అన్ని డిజిటల్ స్క్రీన్‌ల మధ్యే కరిగిపోయాయి. ఈ పర్యవసానాలపై సోనూసూద్ స్పందించాడు. మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక వ్యవహారం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో డిజిటల్ మీడియా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో 16 ఏళ్లలోపు వారికి ఆన్‌లైన్ మీడియాపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని అన్నారు.